కేంద్ర మంత్రి బండి సంజయ్ భగ్గుమన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. బీసీలకు అన్యాయం చేసి ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డిలో రాహుల్ గాంధీ ప్రకటించింది కామారెడ్డి డిక్లరేషన్ కాదు ముస్లిం డిక్లరేషన్ అంటూ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతిస్తామన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడైనా బీసీని ప్రధానిని చేశారా అని ప్రశ్నించారు.