అమరావతిలో 4 వేల ఇళ్ల నిర్మాణం
NEWS Aug 06,2025 09:27 am
అమరావతి రాజధాని పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. శాకమురు రిజర్వాయర్, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ , అనంతవరం పార్క్ వద్ద జరుగుతున్న రాజధాని అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ సిబ్బంది కోసం 4,000 ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి లోపు పూర్తవుతుందన్నారు. ఐఐటీ నిపుణులు లే అవుట్ డిజైన్లు ఖరారు చేశారన్నారు. వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.