ప్రాణం ఉన్నంత వరకు తాను బీఆర్ఎస్ పార్టీ లోనే ఉంటానని స్పష్టం చేశారు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో కొంత మంది పనిగట్టుకుని దృష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లనని, ఏ పార్టీలో చేరే ప్రసక్తి లేదన్నారు. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.