మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదంతా గ్యాస్, ట్రాస్ తప్ప ఏం లేదంటూ కొట్టి పారేశారు. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే వాళ్ల బాగోతం అర్థమైందన్నారు. దమ్ముంటే మొత్తం కమిషన్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.