ఏపీ బలంగా పుంజుకుంటోంది... ఈ వసూళ్లే నిదర్శనం: మంత్రి నారా లోకేశ్
NEWS Aug 05,2025 07:04 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దీనికి నిదర్శనంగా జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయని రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.రాష్ట్రంలో 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా 2025 జూలై నెలలో రూ.3,803 కోట్లు వసూలైనట్లు లోకేశ్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ఆయన వివరించారు.