భారత్‌పై ట్రంప్ హెచ్చరిక: 24 గంటల్లో కొత్త టారిఫ్‌లు
NEWS Aug 05,2025 06:32 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, 24 గంటల్లో కొత్త టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. భారత్‌తో వ్యాపారం కష్టంగా ఉందని, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసి, దానిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించి లాభాలు గడిస్తోందని ఆరోపించారు. ఈ చమురు కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థిక వనరులు చేకూరి, ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతోందని విమర్శించారు.