దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్లింగ్ డ్రైవ్: మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథి"
NEWS Aug 05,2025 03:16 pm
గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారేందుకు రాష్ట్రం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు రేపు విజయవాడ నోవాటెల్ హోటల్ లో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ ను చేపడుతోంది. దేశ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ను శక్తివంతం చేయడంతో పాటు సౌర, పవన శక్తికి నైపుణ్య హబ్ గా ఏపీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ డ్రైవ్ ను నిర్వహిస్తున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.