నితిన్ గడ్కరీతో మంత్రి వివేక్ భేటీ
NEWS Aug 05,2025 02:21 pm
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్. తనయుడు ఎంపీ వంశీ కృష్ణ కూడా ఉన్నారు. పెండింగ్ లో ఉన్న రహదారుల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జోడువాగు రహదారి అభివృద్ధి పనులు, NH-63 నిర్మాణం ఏడాది దాటినా ఇంకా డీపీఆర్ దశలోనే ఉండి పోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. రెండు ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.