జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్ను మూశారు. అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గొంతు విప్పారు. అంతే కాకుండా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. రామ్ మాధవ్ పై సంచలన ఆరోపణలు చేశారు. రైతుల ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచారు.