కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లును క్లియర్ చేయాలని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బీసీలు కాకపోయినా శాస్త్రీయంగా కుల గణన చేసి ముందుకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణలో ముస్లింలను పక్కన బెడితే బీసీ బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలను ఎందుకు పక్కన బెట్టడం లేదన్నారు.