కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె
NEWS Aug 05,2025 11:31 am
రాష్ట్ర వ్యాప్తంగా కేఎస్ఆర్టీసీ సమ్మెకు దిగింది. దీంతో బస్సులు ఎక్కడికక్కడ ఆగి పోయాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని, జీతాల సవరణను డిమాండ్ చేస్తూ ఇవాళ నిరవధిక రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రారంభించారు. సమ్మె కారణంగా వేలాది బస్సులు డిపోలలోనే నిలిచి పోయాయి. KSRTC, BMTC, NWKRTC, KKRTC ఉద్యోగుల సంఘాల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.