మంత్రి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీపై. గతంలో అమరావతికి నిధులు ఇవ్వవద్దని వరల్డ్ బ్యాంకుకు మెయిల్స్ పంపిందని ఆరోపించారు. 2014-19లో సింగపూర్ ప్రభుత్వంలో మేజర్ షేర్ ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. జగన్ సర్కార్ సింగపూర్‌కు సీఐడీ అధికారులను పంపి కేసులు పెట్టించిందన్నారు. అందుకే సంబంధాలను మెరుగు పరిచేందుకు ముఖ్యమంత్రి స్వయంగా సింగపూర్ వెళ్లి అక్కడి ప్రభుత్వాధినేతలతో మాట్లాడారన్నారు.