సింహాద్రి అప్పన్న ఉద్యోగి సస్పెన్షన్
NEWS Aug 05,2025 09:20 am
సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి ఆలయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగి జి. కొండలరావుపై వేటు వేశారు ఈవో త్రినాథరావు. పలుమార్లు పద్దతి మార్చుకోవాలని సూచించినా పట్టించు కోలేదని, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తుండడంతో వేటు వేయాల్సి వచ్చిందన్నారు. కొండలరావు ప్రస్తుతం శానిటరీ విభాగంలో పని చేస్తున్నారు.