మల్యాల మండలంలోని రాంపూర్ శివారులో ఉన్న భవానీగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి ప్రవేశించి రెండు హుండీలను పగులగొట్టి నగదును అపహరించారు. ఆలయ అర్చకుడు సంగ ఎర్రన్న ఆలయానికి వచ్చేసరికి తాళాలు విరగ్గొట్టబడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.