ఏపీలో ఏడుగురు ఐఏఎస్ లకు పోస్టింగ్
NEWS Aug 05,2025 08:42 am
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. 2023 బ్యాచ్ కు చెందిన ఏడుగురికి సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చింది. మదనపల్లికి చల్లా కళ్యాణి, కందుకూరుకు హిమ వంశీ, నూజివీడుకు వినుత, పాలకొండకు స్వప్ననీల్ జగన్నాథ్, రాజంపేటకు భావన, పార్వతీపురంకు వైశాలి, రంప చోడవరంకు శుభం నోక్ వాల్ కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.