శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.21 కోట్లు
NEWS Aug 05,2025 08:25 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో రద్దీగా ఉంది. శ్రీవారిని 69 వేల 928 మంది దర్శించచకున్నారు.29 వేల 297 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయంరూ. 4.21 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.