కాళేశ్వరం కమిషన్ నివేదికలో సీఎస్ పేరు
NEWS Aug 05,2025 06:58 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ఆగస్టు 30న పదవీ విరమణ చేయనున్నారు. తాజాగా ప్రభుత్వం నియమించిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తుది నివేదిక సర్కార్ కు అందజేసింది. ఇందులో ప్రధానంగా కీలకమైన పాత్ర పోషించినట్లు సీఎస్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం కలకలం రేపింది. తను పదవికి రాజీనామా చేస్తారా లేక పదవీ కాలాన్ని పొడిగిస్తారా అన్నది వేచి చూడాలి.