కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్ విమర్శలు, కవితపై సెటైర్
NEWS Aug 04,2025 08:35 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఇష్టానుసారం డిజైన్లు మార్చి, అంచనా వ్యయం పెంచి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ 665 పేజీల నివేదిక సమర్పించగా, కేబినెట్ దానిని ఆమోదించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో లోపాలను NDSA నిర్ధారించిందని, అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చిస్తామని సీఎం తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై సెటైర్ వేస్తూ, ఆమె ఘోష్ కమిటీకి నివేదిక ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.