కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పులు... తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన
NEWS Aug 04,2025 05:32 pm
కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత అప్పులపై వడ్డీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణాల చెల్లింపు, రీషెడ్యూల్ మార్పులు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్‌కు డౌన్ గ్రేడ్ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.