అంబానీకి రుణాలిచ్చిన బ్యాంకులకు నోటీసులు
NEWS Aug 04,2025 04:19 pm
అనిల్ అంబానీకి చెందిన సంస్థలకు అప్పులిచ్చిన పలు బ్యాంకులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. మొత్తం 13 బ్యాంకులకు నోటీసులు పంపించింది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు బ్యాంకులు కూడా ఉన్నాయి. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లాంటి కంపెనీలకు భారీగా రుణాలు ఇచ్చాయి బ్యాంకులు.