కవితపై మండిపడ్డ జగదీశ్వర్ రెడ్డి
NEWS Aug 04,2025 03:50 pm
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవితపై. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అంటూ ఎద్దేవా చేశారు. తాను చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచాను కానీ కొందరు అసలు గెలవలేదు కదా అని ప్రశ్నించారు. చాలా సార్లు కేసీఆర్ ను కలిశానని, ఆమె గురించి చర్చ జరగ లేదన్నారు. 25 ఏళ్ల నుండి పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని చెప్పారు.