సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి
NEWS Aug 04,2025 03:14 pm
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందన్నారు. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.