శిబూ సోరెన్ మృతి: సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
NEWS Aug 04,2025 11:36 am
జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన, గిరిజన సమస్యల పరిష్కారంలో శిబూ సోరెన్ మడమతిప్పని పోరాటం చేశారని కొనియాడారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ఆయన తనదైన ముద్ర వేశారని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీ, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, జార్ఖండ్ సీఎంగా శిబూ సోరెన్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఆయన కుమారుడు హేమంత్ సోరెన్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.