తెలంగాణ కేబినెట్ భేటీ: కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చ
NEWS Aug 04,2025 11:04 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాన అజెండాగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై జస్టిస్ పీ.చంద్రఘోష్ కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. కమిషన్ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లపై క్రిమినల్ చర్యలు సూచించింది. 650 పేజీల నివేదికను అధ్యయనం చేసిన బ్రీఫ్ కమిటీ రిపోర్టును సీఎస్ రామకృష్ణా రావు కేబినెట్‌లో ప్రవేశపెట్టనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశంపైనా చర్చించనున్నారు.