ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీ యాగం
NEWS Aug 04,2025 10:15 am
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం నిర్వహించనున్నారు. ఈ యాగం ఆగస్టు 4 నుంచి 6 వరకు జరగనుంది. 15 మంది ఋత్వికులతో కేసీఆర్, శోభ దంపతులు యాగాన్ని నిర్వహిస్తారు. రాజకీయ ప్రతికూలతలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ విచారణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా అనేది ఆసక్తికరంగా ఉంది.