ఏపీ లిక్కర్ స్కాం: మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు
NEWS Aug 03,2025 08:18 pm
ఏపీలో లిక్కర్ స్కాం ఢిల్లీ కన్నా 10 రెట్లు పెద్దదని మంత్రి పార్థసారథి వెల్లడించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ స్కాంతో ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకాలు తగ్గాయని, కల్తీ మద్యం వల్ల 35 వేల మంది మరణించారని, 30 లక్షల మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. సిట్ విచారణలో వేలాది బినామీ లావాదేవీలు, ఎన్నికల కోసం నగదు రూపంలో లావాదేవీలు జరిగినట్లు బయటపడిందని మంత్రి పేర్కొన్నారు.