నాపై కిడ్నాప్ యత్నం జరిగింది - పాల్
NEWS Aug 03,2025 07:53 pm
తనపై కిడ్నాప్ యత్నం జరిగిందని వీడియో రిలీజ్ చేశారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కే.ఏ.పాల్. సుప్రీంకోర్టు విచారణకు వెళ్తున్నప్పుడు తనను ఏడుగురు కిడ్నాపర్లు చుట్టు ముట్టారని వాపోయారు. ఆటోలు, కార్లతో వెంబడించారని తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని అన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై నిషేధం విధించాలని పిల్ వేశానన్నారు. ఆర్థికంగా నష్టపోయి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం వల్లనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.