బ్రతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి మృతదేహం దాదాపు నెల రోజులకు స్వగ్రామం చేరుకుంది. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన బూస అంజయ్య (50) జులై 4న దుబాయ్ లో మిత్రులతో కలిసి బయటకు వెళ్లి.. రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. అయితే మృతదేహం కోసం కుటుంబ సభ్యులు నెల రోజులుగా ఎదురుచూశారు. మృతదేహం ఆదివారం ఇంటికి చేరుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.