మల్యాల మండలం తాటిపల్లిలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కరపత్రాలను గడప గడపకు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ పాత్రను ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశ్యంతో కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని మండలాధ్యక్షుడు మల్లేశం అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీ పక్షాన ఉన్నారని, అలాగే రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.