మరో మూడు నెలల్లో కర్నూల్ లో హైకోర్టు బెంచ్ పూర్తవుతుందని వెల్లడించారు మంత్రి టీజీ భరత్. పూర్తి స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందన్నారు. సీఎంతో కలిసి సింగపూర్ లో జరిపిన పర్యటన విజయవంతమైందని చెప్పారు. భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయని చెప్పారు.