బనకచర్లపై మా స్టాండ్ క్లియర్ - డీకే అరుణ
NEWS Aug 03,2025 12:34 pm
బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు బనకచర్ల ప్రాజెక్టుపై. తమ పార్టీ స్టాండ్ ఏమిటనేది పదే పదే అడుగుతున్నారని, తాము ప్రాజెక్టు విషయంలో క్లియర్ గా ఉన్నామని అన్నారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముందు మిగులు జలాల అంశం తేల్చాలన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో ముందు ప్రతిపాదించిన డిజైన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్ట్ కాస్తా నాగర్ కర్నూల్- నల్గొండ ప్రాజెక్టుగా మారిందంటూ మండిపడ్డారు.