స్వదేశీ వస్తువులే కొనుగోలు చేద్దాం - పీఎం
NEWS Aug 03,2025 10:06 am
స్వదేశీ వస్తువులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు వేసిన నేపథ్యంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, యువత సంక్షేమానికి కేంద్రం ప్రయారిటీ ఇస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన అస్థిర వాతావరణంలో భారతదేశం ఆర్థిక ప్రయోజనాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు.