శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
NEWS Aug 03,2025 09:59 am
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆరు రేడియల్ క్రెస్టు గేట్ పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,88,791 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2,25,759 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.9 అడుగులకు చేరుకుంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.3623 టీఎంసీలుగా ఉంది. నీళ్లు సమృద్దిగా ఉండడంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.