టీటీడీపై ఎల్వీ సుబ్రమణ్యం సంచలన ఆరోపణలు
NEWS Aug 03,2025 08:59 am
ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనంలో AI వినియోగంపై మండిపడ్డారు. శ్రీవారి ఆలయంలో గంటలో స్వామి వారి దర్శనం అనేది అసంభవం అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేనే లేదన్నారు . ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్నీ వృథా చేయడం మంచిది కాదని హితవు పలికారు.