22 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు
NEWS Aug 03,2025 12:58 pm
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో, పావని కంటి ఆసుపత్రి, ఆపి, రోటరీ క్లబ్ సహకారంతో జగిత్యాల నియోజకవర్గంలోని 22 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. శస్త్రచికిత్సల అనంతరం, రోగులకు ఉచిత కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, శ్రీనివాస్ రావు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.