మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో రాత్రి 60 ఏళ్ల సకినపల్లి ఖాసిం హత్యకు గురయ్యాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడిని గుర్తు తెలియని దుండగులు ముఖంపై కొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.