50 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం ఏం తెచ్చాడో చెప్పాలి..?
NEWS Aug 03,2025 08:21 am
మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు ఏ సీఎం 50 సార్లు ఢిల్లీకి వెళ్లలేదని, ఎందుకు వెళ్లారో, రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం వెళుతున్నారే తప్పా ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని అన్నారు. స్వంత ఖర్చులతో వెళుతున్నారా లేక రాష్ట్రం తరపున వెళుతున్నారో చెప్పాలన్నారు.