దాసరి హరిచందనపై సీఎస్ కు ఫిర్యాదు
NEWS Aug 03,2025 08:17 am
ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌లపై ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావుకు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించారని, ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధ్యతాయుతమై పదవుల్లో ఉన్న వారు ఇలా వ్యవహరించడం తగదన్నారు.