తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Aug 03,2025 08:14 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీ వేంకటేశ్వర స్వామిని 82 వేల 367 మంది భక్తులు దర్శించుకున్నారు. 31 వేల 420 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.