ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోంది
NEWS Aug 03,2025 06:22 am
ఏపీలో పోలీస్ రాజ్యం నడస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ . పోలీసులు కొందరు అధికార పార్టీకి కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని మండిపడ్డారు. తన పర్యటన సమయంలో కూడా ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. రేపల్లెలో రైతుల సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబుపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తనను ఫోన్ లో పరామర్శించారు జగన్ రెడ్డి.