ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు
NEWS Aug 02,2025 06:12 pm
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నెలకు రూ.50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. దువ్వాడపై 353(2),351(2) BNS, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని 35(3) నోటీసు జారీ చేశారు.