కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చింది
NEWS Aug 02,2025 04:31 pm
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోషి అని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేసి అప్పులపాలు చేశారంటూ పేర్కొందన్నారు. ఇంజినీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ తన సొంత లాభం చూసుకున్నారని , రెండు పిల్లర్లు కుంగడం సామాన్య విషయమా? ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్ము తిన్న వాళ్లు కక్కక తప్పదన్నారు.