మహాశక్తి పథకం హామీ అమలు మాటేంటి..?
NEWS Jul 23,2025 07:17 am
మహిళలకు ప్రతి నెలా రూ. 1500 జమ చేస్తామంటూ ఎన్నికల సందర్బంగా కూటమి సర్కార్ ఇచ్చిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ స్కీం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాల్సిందేనంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక భారం అవుతుందని తెలిసినా ఎందుకని హామీ ఇచ్చారో చెప్పాలన్నారు. పూర్తిగా మహిళలను మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందని అన్నారు.