విద్యార్థులకు ఎస్సై అవగాహన సదస్సు
NEWS Jul 22,2025 10:20 pm
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు, కొండపి ఎస్సై ప్రేమ్ కుమార్, వారి సిబ్బందితో కలసి కొండపి మండలం పెట్లూరు గ్రామంలో సహజానంద స్కూల్ లో ఉన్న విద్యార్ధిని, విద్యార్థులకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులు పల్లెలకు పట్టుకొమ్మలన్నారు. చిన్నారులు చిన్నతనం నుంచి సత్ప్రవర్తనగా మెలగాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులు పర్యవేక్షణలో ఉండాలన్నారు.