రాజమండ్రి జైలుకు ఎంపీ మిథున్ రెడ్డి
NEWS Jul 20,2025 06:26 pm
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. లిక్కర్ స్కాంలో తను ఏ4గా ఉన్నాడు. తనకు ఆరోగ్యం బాగో లేదని, వైప్లస్ సెక్యూరిటీ ఉందని, కనుక నెల్లూరు జైలుకు తరలించాలని కోరారు ఎంపీ తరపు లాయర్. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది సిట్ తరపు లాయర్. కోర్టు జడ్జి వీరి వాదనలతో ఏకీభవించారు. తనను రాజమండ్రి జైలుకు తరలించాలని స్పష్టం చేశారు.