మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
NEWS Jun 30,2026 10:39 am
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయంగానూ గిరాకీ నెమ్మదించడంతో గోల్డ్, సిల్వర్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,170కు, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,28,450 కు పడిపోయింది. కేజీ వెండి ధర రూ.2.25 లక్షలు.