పెద్దపల్లి ముత్యాల పోచమ్మ వాడలో బోనాలు ఘనంగా జరిగాయి. భక్తులంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కులమతాలకు అతీతంగా వాడలోని ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. ముత్యాల పోచమ్మ ఆలయం నుండి ఊరేగింపు బాణాసంచాలు కాల్చుతూ భక్తులు ఉత్సాహంగా ముందుకు సాగింది. సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా ఈ ఆనవాయితీ ఘనంగా జరుగుతుంది. పోచమ్మ తల్లి ఆశీస్సులతో వాడ భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.