బోనం ఎత్తిన ముథోల్ ఎమ్మెల్యే
NEWS Jul 20,2025 09:32 pm
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ అమ్మవారి బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.అమ్మవారికి బోనమెత్తి,ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని,రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు..