షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని బీజేపీ పాదయాత్ర
NEWS Jul 20,2025 09:28 pm
ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ తెరిపించాలని కోరుతూ మల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోమన్న గుట్ట నుంచి ముత్యంపేట కర్మాగారం వరకు పాదయాత్ర చేపట్టారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చక్కెర కర్మాగారం తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టుపెట్టారని, ఏడాదిన్నర గడిచినా ఫ్యాక్టరీ పునః ప్రారంభం కాలేదన్నారు.