భాగ్యనగరంలో ఆషాఢమాసం బోనాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. లాల్ దర్వాజా బోనాల జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలతో బారులు తీరారు. చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భారీగా భక్తుల సందడి ఉంది. లాల్ దర్వాజాలో అమ్మవారు సింహవాహినీ రూపంలో కనిపిస్తున్నారు. అమ్మవారి పాటలతో ఆలయాలన్నీ సందడిగా మారిపోయాయి.